భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లా శీతలా మాత ఆలయం సమీపంలో భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో ఉన్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


