‘బంగ్లాకు స్వేచ్ఛనిచ్చాం.. భూటాన్ వైపు చూడలేదు’ | ndia never tried to expand its territory says gadkari on china intrusion | Sakshi
Sakshi News home page

‘బంగ్లాకు స్వేచ్ఛనిచ్చాం.. భూటాన్ వైపు చూడలేదు’

Jun 26 2020 10:28 AM | Updated on Jun 26 2020 10:28 AM

ndia never tried to expand its territory says gadkari on china intrusion - Sakshi

నాగపూర్: భారత భూభాగంలోకి చైనా చొరబడే ప్రయత్నం చేసిందని బదులుగా సైన్యం దీటైన జవాబిచ్చిందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు. మహారాష్ట్రలోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ జరిగిన ఆన్ లైన్ కాన్ఫరెన్స్ లో ‘ఇండియా సామ్రాజ్యవాది కాదు. కానీ ఎవరైనా భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే దీటుగా బదులిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. (చైనా మైండ్‌ గేమ్‌)

బంగ్లాదేశ్​ స్వతంత్రం కోసం ఇండియా పోరాడిందే తప్ప వాళ్ల భూమి వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. దేశాన్ని ఆనుకుని ఉన్న భూటాన్ లాంటి చిన్నదేశం నుంచి ఒక్క ఇంచు స్థలాన్ని కూడా ఆశించలేదని తెలిపారు. (డ్రాగన్‌తో కటీఫ్‌ సాధ్యమేనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement