'మోడీనోమిక్స్' ఆవిష్కరించనున్న మోడీ | Narendra Modi to launch 'ModiNomics' book in Delhi today | Sakshi
Sakshi News home page

'మోడీనోమిక్స్' ఆవిష్కరించనున్న మోడీ

Feb 15 2014 10:20 AM | Updated on Aug 15 2018 2:14 PM

సమీర్ కొచ్చర్ రచించిన మోడీనోమిక్స్ పుస్తకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ శనివారం న్యూఢిల్లీలో ఆవిష్కరించనున్నారు

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ రచయిత సమీర్ కొచ్చర్ రచించిన మోడీనోమిక్స్ పుస్తకాన్ని  ఆవిష్కరించనున్నారు. శనివారం న్యూఢిల్లీలో లోధి రోడ్డులోని ఇండియన్ హెబిటేట్ సెంటర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మోడీ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గుజరాత్లో మోడీ సమర్థవంతమైన పాలనతోపాటు,  మోడీ చేపట్టిన విధి విధానాలతో రాష్ట్రాభివృద్ధి జరిగిన తీరు ఆ పుస్తకంలో పూసగుచ్చినట్లు రచయిత సమీర్ వివరించారు.

 

అంతేకాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత వెనక ఉన్న ఆర్థిక, అభివృద్ది వ్యూహాలను మోడీనోమిక్స్ పుస్తకంలో విశదీకరించారు. ఆ పుసక్తావిష్కరణ కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ కూడా పాల్గొనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement