నిత్యావసరాలపై బెంగవద్దు 

Narendra Modi Says Dont Worry About Essential Needs - Sakshi

ఆంక్షలు, మినహాయింపులపై కేంద్రం స్పష్టత

ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక 

సాక్షి, న్యూఢిల్లీ: 21 రోజుల పాటు దేశం లాక్‌ డౌన్‌ ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటన చేసిన అనంతరం కేంద్ర హోం శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. 
1.లాక్‌ డౌన్‌ వర్తించేవి: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు, పబ్లిక్‌ కార్పొరేషన్‌ సంస్థలు మూసి ఉంటాయి. 
ఇందులో మినహాయింపు వర్తించేవి: రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ, పబ్లిక్‌ యుటిలిటీస్‌(పెట్రోలియం, సీఎన్‌జీ, ఎల్పీజీ, పీఎన్‌జీ), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, పవర్‌ జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌ యూనిట్స్, పోస్ట్‌ ఆఫీసులు, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ 
2. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు మూసి ఉంటాయి. 
వీటిలో మినహాయింపు వర్తించేవి:
ఎ) పోలీస్, హోం గార్డు, సివిల్‌ డిఫెన్స్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసులు, జైళ్ల విభాగం 
బి) జిల్లా పరిపాలన కార్యాలయాలు, ట్రెజరీ 
సి) విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య విభాగాలు 
డి) పురపాలక సంస్థలు–అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది(శానిటేషన్, వాటర్‌ సప్లయ్‌) 
3. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, ఔషధ ఉత్పత్తులు, పంపిణీ సంస్థలు (పబ్లిక్, ప్రయివేటు), డిస్పెన్సరీలు, కెమిస్ట్‌(ఫార్మసీ), వైద్య పరికరాల షాపులు, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్స్, అంబులెన్స్‌ సేవలు  
4. అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు మూసి ఉంటాయి. 
ఇందులో మినహాయింపు వర్తించేవి: 
ఎ) షాపులు (రేషన్‌ షాపులు, ఫుడ్, కిరాణం, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా తదితర షాపులు తెరిచి ఉంటాయి. ప్రజలు ఇక్కడికి రావడం కంటే ఇవి హోం డెలివరీ అయ్యేలా జిల్లా యంత్రాంగం చూడాలి.  
బి) బ్యాంకులు, బీమా సంస్థలు, ఏటీఎంలు  
సి) ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా 
డి) టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్‌ సేవలు, బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు(సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి పనిచేయాలి) 
ఇ) ఫుడ్, ఫార్మా, వైద్య పరికరాలు ఈ–కామర్స్‌ ద్వారా హోం డెలివరీ కొనసాగుతుంది. 
ఎఫ్‌) పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్‌ రీటైల్, స్టోరేజ్‌ యూనిట్లు తెరిచి ఉంటాయి.  
జి) పవర్‌ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ యూనిట్లు, సేవలు కొనసాగుతాయి 
హెచ్‌) సెబీ గుర్తింపు పొందిన కాపిటల్‌ 
ఐ) కోల్డ్‌స్టోరేజ్‌ అండ్‌ వేర్‌హౌజింగ్‌ సేవలు 
జె) ప్రయివేటు సెక్యూరిటీ సేవలు (ఇతర అన్ని సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయొచ్చు) 
5. పారిశ్రామిక సంస్థలు మూసి ఉంటాయి. 
ఇందులో మినహాయింపు: ఎ)అత్యవసర వస్తు ఉత్పత్తుల తయారీ సంస్థలు బి) నిరంతరం ఉత్పత్తి చేయాల్సిన ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొనసాగించవచ్చు. 
6. విమానం, రైలు, రోడ్డు రవాణా ఉండదు. 
మినహాయింపు: ఎ) అత్యవసర వస్తువుల రవాణా బి) అగ్నిమాపక సేవలు, శాంతి భద్రతలు, ఇతర అత్యవసర రవాణా సేవలు 
7. ఆతిథ్య సేవలు నిలిపివేయాలి 
మినహాయింపు: లాక్‌డౌన్‌లో చిక్కుకున్నవారు, పర్యాటకుల కోసం, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందించే సిబ్బంది, విమానయాన సిబ్బంది, నౌకాయాన సిబ్బంది కోసం హోటళ్లు, లాడ్జీలకు మినహాయింపు 
8. విద్యా సంస్థలు, పరిశోధన, కోచింగ్‌ సంస్థలు బంద్‌ 
9. అన్ని ప్రార్థన మందిరాలు మూసి ఉంటాయి.  
10. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం 
11. అంత్యక్రియల విషయంలో 20 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు. 
12. ఫిబ్రవరి 15 తరువాత దేశంలోకి వచ్చిన వారంతా స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు నిర్ధిష్ట కాలం హోం క్వారంటైన్‌లో లేదా ఆసుపత్రి క్వారంటైన్‌లో ఉండాలి. లేనిపక్షంలో ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు. 
13. ఈ చర్యలన్నీ అమలయ్యేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్‌ కమాండర్‌గా క్షేత్రస్థాయిలోకి పంపి అమలయ్యేలా చూడాలి. ఈ చర్యలు అమలుకావడంలో ఇన్సిడెంట్‌ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు.  
14. ఈ ఆంక్షలన్నీ ప్రజల కదలికల నియంత్రణకే తప్ప అత్యవసర వస్తువుల రవాణాకు సంబంధించి కాదని యంత్రాంగం గుర్తుంచుకోవాలి. 
15. ఆసుపత్రుల సేవలు కొనసాగడం, వాటికి వనరుల సమీకరణ కొనసాగేలా ఇన్సిడెంట్‌ కమాండర్స్‌ చూడాలి. అలాగే ఆసుపత్రుల విస్తరణ, వాటికి అవసరమయ్యే మెటీరియల్, పనివారు లభ్యమయ్యేలా చూడాలి. 
16. ఆంక్షలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు గల సెక్షన్ల కింద శిక్షార్హులు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top