'ప్రియాంక కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారు'
జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ రచయిత్రి శోభా డే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
న్యూఢిల్లీ: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ రచయిత్రి శోభా డే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. జపాన్ పర్యటనలో నరేంద్రమోడీ మార్చిన దుస్తులపై శోభా డే వ్యాఖ్యలు చేశారు.
ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రా మార్చిన దుస్తుల కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో శోభా డే ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇటీవలకాలంలో ప్రధాని నరేంద్రమోడీ ధరించే దస్తులు అందర్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకత ఉట్టిపడేలా ప్రధాని దుస్తుల ఎంపికపై కూడా పలు పత్రికల్లో చర్చనీయాంశమయ్యాయి.