
సాక్షి, న్యూఢిల్లీ : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఉగాది పండుగ సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
ఈ పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.