కర్ణాటక సీఎంకు మోదీ సవాల్‌

Narendra Modi Fitness Challenge For Karnataka CM Kumaraswamy - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ఉదయం వేళ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని సోషల్‌ మీడియాలో మోదీ తెలిపారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరారు. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్‌ అధికారులను ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇటీవల కోహ్లి విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ.. తాజాగా తన ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ను పోస్ట్‌ చేశారు. 

ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’లో భాగంగా పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ మంత్ర పేరుతో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ విరాట్‌ కోహ్లీ, హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్‌ తాను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ ట్యాగ్‌ చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top