పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ | Narendra modi blames film industry for creating bad image of police force | Sakshi
Sakshi News home page

పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ

Nov 30 2014 11:56 AM | Updated on Aug 15 2018 2:20 PM

పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ - Sakshi

పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ

సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

న్యూఢిల్లీ: సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని  ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సినీ ప్రముఖలతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. ఆదివారం మోదీ గౌహతిలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు.

ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక విధి నిర్వహణలో 33 వేలమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భద్రత వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చని, మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం తగదని సినీరంగానికి సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement