హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ముక్తా | Narendra Dabholkars Daughter On Right Wing Hit List | Sakshi
Sakshi News home page

హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె

Sep 1 2018 8:29 PM | Updated on Oct 8 2018 5:45 PM

Narendra Dabholkars Daughter On Right Wing Hit List - Sakshi

ముక్తా దభోల్కర్‌, నరేంద్ర దబోల్కర్‌

ముంబై : పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్‌) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అహ్వద్‌ తదితరుల పేర్లు సైతం హిట్‌ లిస్టులో ఉన్న విషయాన్ని ఏటీఎస్‌ వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందూత్వ తీవ్రవాది అవినాష్‌ పవార్‌ పై ఏటీఎస్‌ కోర్టుకి సమర్పించిన డైరీలో ఈ విషయాలను ప్రస్తావించింది.

హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తా దభోల్కర్, శ్యాంమానవ్, జితేంద్ర అహ్వద్‌ తదిరులను అనుమానిత హిందూత్వ తీవ్రవాది అవినాష్‌ పవార్‌  నిఘా పెట్టి, వారిని వెంబడించినట్టు స్థానిక సెషన్స్‌ కోర్టుకి సమర్పించిన రిపోర్టులో ఏటీఎస్‌ పేర్కొన్నది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌ కింద అరెస్టయిన ఐదో వ్యక్తి అవినాష్‌ పవార్‌. అంతకు ముందు ఇదే కేసులో మరో నలుగురిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేసారు. 

Advertisement
 
Advertisement
Advertisement