సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని! | Nalini Singh disclosed Sunanda Pushkar, Shashi Tharoor's secrets | Sakshi
Sakshi News home page

సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!

Jul 24 2014 8:56 AM | Updated on Sep 2 2017 10:49 AM

సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!

సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!

శశి థరూర్, సునంద పుష్కర్ ల సంబంధాల గురించి ప్రముఖ జర్నలిస్ట్ నళిని సింగ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది

న్యూఢిల్లీ: శశి థరూర్, సునంద పుష్కర్ ల సంబంధాల గురించి ప్రముఖ జర్నలిస్ట్ నళిని సింగ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో మాట్లాడిన వారిలో నళిని సింగ్ ఒకరు. తన భర్త శశి థరూర్ పాకిస్థాని జర్నలిస్ట్ మెహర్ తరార్ ను పెళ్లాడాలనుకుంటున్నారని సునంద తెలిపిందని నళిని సింగ్ చెప్పింది. 
 
తరార్, థరూర్ ల మధ్య రొమాంటిక్ మెసేజ్ లు ఒకరికొకరు పంచుకుంటున్నారని, అందులో ఒక మెసేజ్ లో తనకు శశి థరూర్ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉందని, థరూర్ లేకుండా బతకలేనని తరార్ మరో మెసేజ్ లో తెలిపిందని సునంద తనతో చెప్పిందని నళిని సింగ్ కీలక సమాచారాన్ని తాజాగా బయటపెట్టింది. 
 
అంతేకాకుండా తరార్ తో పెళ్లికి థరూర్ కుటుంబం కూడా ప్రోత్సహిస్తోందని సునంద ఆవేదన వ్యక్తం చేసినట్టు నళిని వెల్లడించింది.  సునంద మరణానికి ముందు లీలా హోటల్ లో ఉదయం 4 గంటల నుంచి ఇద్దరూ విపరీతంగా గొడవ పడ్డారని.. వారిద్దరూ గొడవ పడిన విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారని నళిని సింగ్ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement