breaking news
Mehar Tarar
-
థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తాం
సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. థరూర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, తమ సిట్ బృందం ఈ కేసు దర్యాప్తు సంగతి చూస్తోందని ఆయన అన్నారు. వాళ్లకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు త్వరలోనే థరూర్ను విచారణకు పిలుస్తారని చెప్పారు. కేరళలో కొంతకాలం పాటు ఆయుర్వేద చికిత్స పొందిన శశి థరూర్.. ఆదివారమే తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ మధ్య గొడవకు కారణమని చెబుతున్న పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ను కూడా అవసరమైతే ప్రశ్నిస్తామని కమిషనర్ బస్సి చెప్పారు. -
సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!
న్యూఢిల్లీ: శశి థరూర్, సునంద పుష్కర్ ల సంబంధాల గురించి ప్రముఖ జర్నలిస్ట్ నళిని సింగ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో మాట్లాడిన వారిలో నళిని సింగ్ ఒకరు. తన భర్త శశి థరూర్ పాకిస్థాని జర్నలిస్ట్ మెహర్ తరార్ ను పెళ్లాడాలనుకుంటున్నారని సునంద తెలిపిందని నళిని సింగ్ చెప్పింది. తరార్, థరూర్ ల మధ్య రొమాంటిక్ మెసేజ్ లు ఒకరికొకరు పంచుకుంటున్నారని, అందులో ఒక మెసేజ్ లో తనకు శశి థరూర్ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉందని, థరూర్ లేకుండా బతకలేనని తరార్ మరో మెసేజ్ లో తెలిపిందని సునంద తనతో చెప్పిందని నళిని సింగ్ కీలక సమాచారాన్ని తాజాగా బయటపెట్టింది. అంతేకాకుండా తరార్ తో పెళ్లికి థరూర్ కుటుంబం కూడా ప్రోత్సహిస్తోందని సునంద ఆవేదన వ్యక్తం చేసినట్టు నళిని వెల్లడించింది. సునంద మరణానికి ముందు లీలా హోటల్ లో ఉదయం 4 గంటల నుంచి ఇద్దరూ విపరీతంగా గొడవ పడ్డారని.. వారిద్దరూ గొడవ పడిన విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారని నళిని సింగ్ తెలిపింది.