థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తాం | Shashi Tharoor may be questioned soon, says police commissioner | Sakshi
Sakshi News home page

థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తాం

Jan 12 2015 2:49 PM | Updated on Sep 18 2019 3:04 PM

థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తాం - Sakshi

థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తాం

సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.

సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. థరూర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, తమ సిట్ బృందం ఈ కేసు దర్యాప్తు సంగతి చూస్తోందని ఆయన అన్నారు. వాళ్లకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు త్వరలోనే థరూర్ను విచారణకు పిలుస్తారని చెప్పారు.

కేరళలో కొంతకాలం పాటు ఆయుర్వేద చికిత్స పొందిన శశి థరూర్.. ఆదివారమే తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ మధ్య గొడవకు కారణమని చెబుతున్న పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ను కూడా అవసరమైతే ప్రశ్నిస్తామని కమిషనర్ బస్సి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement