రాజీవ్‌ హత్య కేసు: నళినీ పిటిషన్‌ తిరస్కరణ

Nalini Plea For Early Release Rejected By Madras HC - Sakshi

చెన్నై: మాజీ ప్రధాని రాజీమ్‌ గాంధీ హత్య  కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న నళిని తన ముందస్తు విడుదల కోరుతు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 గవర్నర్‌ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని నళిని పిటిషన్‌లో పేర్కొంది. ఆమె అభ్యర్ధనను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శశిధరన్‌, ఆర్‌. సుబ్రహ్మణ్యన్‌ల బెంచ్‌ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. రాజీవ్‌ గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, నళిని ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేసిన స్వీకరించవద్దని 2017 నవంబర్‌లో​ తమిళనాడు ప్రభుత్వం  హైకోర్టును కోరింది. నళిని దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి రాజీవ్‌ శక్దేర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.

1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో  ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల​ రాజీవ్‌గాంధీ కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం.’అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top