'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం' | my health still control says manorama | Sakshi
Sakshi News home page

'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం'

Feb 16 2015 12:00 PM | Updated on Apr 3 2019 9:12 PM

'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం' - Sakshi

'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం'

తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను సీనియర్ నటి మనోరమ ఖండించారు.

చెన్నై: తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను సీనియర్ నటి మనోరమ ఖండించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆమె సోమవారమిక్కడ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తనయుడు భూపతి ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.

కాగా  మనోరమ కొంతకాలం క్రితం బాత్‌రూమ్‌లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం మనోరమ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మనోరమ మరణించారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement