వాలెంటైన్స్‌ డే : ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడిన యువకుడు | MP Man Marries Transgender on Valentines Day | Sakshi
Sakshi News home page

వాలెంటైన్స్‌ డే : ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడిన యువకుడు

Feb 15 2019 11:57 AM | Updated on Feb 12 2020 9:46 AM

MP Man Marries Transgender on Valentines Day - Sakshi

జునైద్‌ ఖాన్‌, జయాసింగ్‌

నీ పైన నా ప్రేమకు అంతేలేదు.. నిన్ను నా కలల రాణిగా చూసుకుంటా’

ఇండోర్‌ : ‘నీ పైన నా ప్రేమకు అంతేలేదు.. నిన్ను నా కలల రాణిగా చూసుకుంటా’  అని ప్రేమికుల రోజే ఓ యువకుడు కన్నవారిని, అయిన వారిని ఎదురించి మరి ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జునైద్‌ ఖాన్‌, ట్రాన్స్‌జెండరైన జయా సింగ్‌ను ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. రెండు వారాల క్రితం జునైద్‌ ఖాన్‌ జయాసింగ్‌కు ప్రపోజ్‌ చేయగా.. ఆమె ఒప్పుకుంది. దీంతో ఈ ఇద్దరు ప్రేమికుల రోజే మంచి ముహుర్తంగా భావించి.. హిందూ సంప్రదాయం ప్రకారం ఓ దేవాలయంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

‘నా కుటుంబం మా పెళ్లిని ఒప్పుకోవాలనుంది. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా.. నేను జయాతోనే ఉంటాను. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను’ అని జునైద్‌ ఖాన్‌ మీడియాకు తెలిపాడు. ‘ట్రాన్స్‌జెండర్స్‌కు పెళ్లవ్వడం ఓ సవాల్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ సమాజం వారి పెళ్లిలను అంగీకరించదు. అతని తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోనప్పటికి జునైద్‌ నన్నే పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికైనా వారు మా పెళ్లిని అంగీకరిస్తాని ఆశిస్తున్నాను. ఏదో ఒకరోజు మా అత్త, మామలకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంది.’ అని జయాసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక సోషల్‌ మీడియా వేదికగా ఈ జోడికి మద్దతు లభిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement