2018లో ఎక్కువ మంది మెచ్చిన ట్వీట్‌ ఇదేనంటా..! | Most Liked Tweet Of 2018 Is Virat Kohli Karva Chauth Wish | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ క్రియేట్‌ చేసిన విరుష్కలు

Dec 6 2018 5:21 PM | Updated on Dec 6 2018 5:34 PM

Most Liked Tweet Of 2018 Is Virat Kohli Karva Chauth Wish - Sakshi

దావోస్‌లో మంచుతో నిండి ఉన్న బస్టాప్‌ వద్ద దిగిన ఫొటో ఎక్కువమంది లైక్‌ చేసిన వాటిల్లో రెండో స్థానంలో

మరో ఐదు రోజుల్లో తొలి వివాహ వార్షికోత్సావాన్ని జరుపుకోనున్నారు విరుష్కలు. అప్పుడే వీరి ఇంట ఫస్ట్‌ మ్యారేజ్‌ డే  సెలబ్రేషన్స్‌ షురు అయ్యాయి. ఈ సమయంలో వీరి సంతోషాన్ని రెట్టింపు చేసే రికార్డ్‌ ఒకటి విరుష్కల పేరున క్రియేట్‌ అయ్యింది. 2018 సంవత్సరానికి గాను ఎక్కువ మంది లైక్‌ చేసిన ట్వీట్‌, ఎక్కువ మంది లైక్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోల లిస్ట్‌లో విరుష్కలే ముందున్నారు.

ఈ ఏడాది కర్వ చవతి సందర్భంగా విరాట్‌.. అనుష్కతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నా జీవితం.. నా ప్రపంచం అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ట్వీట్‌ ఎక్కువ మంది లైక్‌ చేసిన దానిగా రికార్డు సృష్టించింది. ఈ ఫోటోను దాదాపు 2 లక్షల మంది లైక్‌ చేయగా.. 14 వేల మంది రిట్వీట్‌ చేశారు. ఇక 2018కి గాను ఎక్కువ మంది లైక్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోగా కూడా విరుష్కల ఫోటోనే నిలిచింది.

వివాహం తరువాత, రిసెప్షన్‌కి ఆహ్వానించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, విరుష్కలు.. ప్రధానితో కలిసి దిగిన ఫోటో ఎక్కువ మందికి నచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోగా రికార్డ్‌ నెలకొల్పింది. దాదాపు 19 లక్షల మంది ఈ ఫోటోను లైక్‌ చేశారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రికార్డులు రెండు కూడా విరుష్కల పేరతోనే ఉండటంతో వీరి సంతోషం డబుల్‌ అయ్యింది.

అంతేకాకుండా 2018లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం సందర్భంగా మోదీ దావోస్‌లో మంచుతో నిండి ఉన్న బస్టాప్‌ వద్ద దిగిన ఫొటో ఎక్కువమంది లైక్‌ చేసిన ఫోటోల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇన్‌స్టాగ్రాంలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న ప్రపంచ నేతల్లో మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఇన్‌స్టాగ్రాంలో ఆయన అత్యంత ప్రభావంతమైన నాయకుడిగా నిలిచారు. ఈ సంవత్సరం ఆయన చేసిన 80 పోస్టులు, వీడియోల్లో ప్రతి ఒక్కదానికి 8 లక్షల మందికిపైగా స్పందించారు. ఈ వివరాలన్నీ 2018లో ఇంటర్నేషనల్ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్ కమ్యునికేషన్‌ ఫర్మ్ బర్సన్‌-మార్స్‌టెల్లర్‌ చేపట్టిన ట్విప్లోమసీ అనే అధ్యయనంలో వెల్లడయ్యాయి.

దాని ప్రకారం..1.48 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్లతో భారత ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ రెండో స్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడో స్థానంలో నిలిచారు. మొదటి పది స్థానాల్లో పోప్‌ ఫ్రాన్సిస్‌, జోర్డాన్‌ రాణి రానియా, యూకే రాజ కుటుంబం ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement