మంత్రికి ఆగంతకుడి ఫోన్‌ : రూ 5 కోట్లు డిమాండ్‌

UP Minister Nand Gopal Gupta Receives Threat Call - Sakshi

లక్నో :  ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ 5 కోట్లు ముట్టచెప్పాలని తనకు బెదిరింపు కాల్‌ వచ్చిందని యూపీ మంత్రి నంద్‌ గోపాల్‌ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగి ఆదిత్యానాథ్‌ మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న గుప్తాకు ఈనెల 12న ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్‌ చేసి తనకు రూ 5 కోట్లు ఇవ్వాలని, అంత మొత్తం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించినట్టు మంత్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, దుండగుడు తన గురించిన ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని, మంత్రిని దూషిస్తూ ఆయన కుటుంబ సభ్యులు అందరినీ హతమానుస్తానని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని కాలర్‌పై మంత్రి తన న్యాయవాదితో కలిసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలహాబాద్‌లోని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితుడు ఫోన్‌ చేసిన నెంబర్‌పై నిఘా పెట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా మంత్రిని బెదిరించిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top