మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి | Militants attack on minister's home, snatch four weapons | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి

Mar 27 2017 8:21 AM | Updated on Sep 5 2017 7:14 AM

మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి

మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి

మంత్రి ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని గాయపరిచి ఆయుధాలతో పరారయ్యారు.

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్‌ జిల్లాలో మంత్రి ఫరూక్‌ అంద్రాబి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయి.

అనంతనాగ్‌లోని డూరులో పీడీపీ మంత్రి ఫరూక్‌ అంద్రాబి నివాసంపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు దాడి చేశారు. సెక్యురిటీ సిబ్బంది ఉగ్రవాదులను నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో.. వారి వద్ద నుంచి ఆయుధాలు తీసుకొని ఉగ్రవాదులు పరారయ్యారు. దాడి జరిగిన సమయంలో ఫరూక్‌ ఆ ఇంట్లో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. శనివారం జమ్మూలో ముగ్గురు వ్యక్తులు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ నుంచి ఏకే 47 తుపాకీని దొంగిలించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement