anantanag
-
ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికున్నా..
''నేను నా కుమారుడి గురించి, అతడు చేసిన షహాదత్ (త్యాగం) కారణంగా గర్వపడుతున్నాను. ఆ గర్వం వల్లనే నేను బతికి ఉన్నాను. లేకపోతే నా కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసిన క్షణంలోనే చనిపోయేవాడిని'' - ఈ మాటలు అన్నది పహల్గావ్కు చెందిన సయ్యద్ హైదర్ షా. మంగళవారం నాటి ముష్కరమూక దాడిలో తన పెద్ద కుమారుడిని ఆయన కోల్పోయారు. కుటుంబ పోషకుడిగా ఉన్న కొడుకు ఉగ్రవాదుల తూటాలకు బలైపోవడంతో హైదర్ షా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇంతటి విషాదంలోనూ కొడుకు చేసిన త్యాగాన్ని హైదర్ షా పదేపదే తలచుకుంటున్నారు.జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గావ్ (Pahalgam) బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో 27 మంది అమాయకులు అసువులు బాశారు. అయితే తన కళ్లెదుటే పర్యాటకులను చంపుతుంటే హైదర్ షా కొడుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా చూస్తూ ఉండలేకపోయాడు. ఉగ్రవాదులను ఎదిరించి టూరిస్టుల ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. కానీ ముష్కరుల తుపాకీ తూటాలకు అడ్డుగా నిలబడి ప్రాణాలు కోల్పోయాడు.రోజూ మాదిరిగానే ఆదిల్ ఆ రోజు ఉదయం పనికి వెళ్లాడు. పర్యాటకులను గుర్రంపై ఎక్కించుకుని తీసుకెళ్లడం అతడి పని. అయితే ఉగ్రదాడి జరిగిన వెంటనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆదిల్ కుటుంబానికి ఈ వార్త తెలిసింది. వెంటనే వారు ఆదిల్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో వారు భయాందోళనతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి ఆస్పత్రికి పరుగులు పెట్టారు. తన కుమారుడికి బుల్లెట్ గాయాలయ్యాయని తెలిసి హైదర్ షా హతాశులయ్యారు. "సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడని మాకు తెలిసింది. అతడి కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈ సంఘటన గురించి నాకు సమాచారం అందించారు" అని హైదర్ గుర్తుచేసుకున్నారు. తన కొడుకు కొంతమంది ప్రాణాలు కాపాడి చనిపోయినందుకు గర్వపడుతున్నానని ఆయన ఏఎన్ఐతో చెప్పారు.మాకు దిక్కెవరు?తమ ఇంటికి మూలస్తంభంగా నిలిచిన కొడుకు అనూహ్యంగా చనిపోవడంతో ఆదిల్ తల్లి శోకసంద్రంలో ముగినిపోయింది. ఇప్పుడు తమను ఎవరు పోషిస్తారని అంటూ రోదిస్తోంది. ''నా కుమారుడు రోజుకు 300 రూపాయిలు సంపాదించేవాడు. అతడు తెచ్చిన డబ్బులతో సాయంత్రం బియ్యం కొని, వంట చేసుకుని కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు మాకు ఎవరు ఆహారం తెస్తారు? ఎవరు మందులు తెస్తారు?" అంటూ ఆదిల్ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. పర్యాటకులను రక్షించే క్రమంలో తన కొడుకు ప్రాణాలు ఫణంగా పెట్టాడని, వారు కూడా మన సోదరులేనని అంటూ ఆమె మానవత్వాన్ని చాటారు.శాశ్వతంగా సెలవు..ఇంటికి త్వరగా వచ్చేస్తానని వెళ్లి ఉగ్రదాడికి ఆదిల్ బలైపోయాడని ఆదిల్ సోదరి రవిసా ఆవేదన చెందింది. ''తనకు ఆరోగ్యం బాలేదు. ఒక రోజు సెలవు తీసుకుంటానని చెప్పాడు. త్వరగా వచ్చేస్తానని పనికి వెళ్లాడు. కానీ అతడు తిరిగి రాలేదు. ఉగ్రవాదుల నుంచి తుపాకీని లాక్కొని టూరిస్టులను కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఛాతీలో మూడు, గొంతులో ఒక బుల్లెట్ దిగింద''ని రవిసా రోదించింది.చదవండి: ప్రాణాలు కాపాడిన ఉప్పుఅండగా ఉంటామన్న అబ్దుల్లాపర్యాటకులను రక్షించేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆదిల్‌ను స్థానికులు రియల్ హీరోగా కొనియాడారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విధంగా స్పందించారు. స్వయంగా ఆదిల్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదిల్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. -
అనంతనాగ్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో అనంత్‌నాగ్ పోలీసులు, మూడు ఆర్ ఆర్, సీఆర్పీఎఫ్ దళాలు సెర్చ్ ఆపరేషన్ని ప్రారంభించాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలోకి రాగానే ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులు జరిపాయి. దాంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నట్లు సమాచారం. ఆదివారం (జూలై 12), జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమారర్చాయి. మరణించిన ఉగ్రవాదులలో ఒకరిని లష్కర్-ఈ-తోయిబాతో సంబంధం ఉన్న ఉస్మాన్‌గా అధికారులు గుర్తించారు. ఇటీవల సోపోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్, ఒక పౌరుడు చనిపోయిన సంగతి తెలిసిందే. సోపూర్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం పోలీసులకు, భద్రతా దళాలకు పెద్ద విజయమని కశ్మీర్ ఐజీపీ అన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, 2 ఆర్ఆర్, సీఆర్పీఎఫ్ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు సోపోర్‌లోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న తరువాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో శ్రీగుఫ్వారా అనంత నాగ్‌లో మరో ఇద్దరు టెరరిస్టులు మరణించారు. దీంతో 24 గంటల్లో 5గురు ఉగ్రవాదులు మరణించారు. -
కశ్మీర్ : ఆర్మీ వాహనం అనుకుని రాళ్లు రువ్వడంతో..
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూకశ్మీర్‌లో మొదలైన సాయుధ బలగాల నిఘా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే కశ్మీర్లో వేల సంఖ్యలో సైనికుల్ని మోహరించామని కేంద్ర హోంశాఖ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కశ్మీర్లో ఆంక్షలు సడలిస్తున్నామని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే, కేంద్రం చెప్తున్న మాటలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించాలనుకున్న విపక్ష సభ్యుల బృందాన్ని శ్రీనగర్‌లోనే అడ్డుకోవడం.. ఆదివారం జరిగిన ఓ సంఘటన ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. నిరసన కారులు రాళ్లు రువ్వడంతో ఓ పౌరుడు మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. (చదవండి : ‘ఫోన్ల కంటే ప్రాణాలే ముఖ్యం’) వివరాలు.. జాదిపొర ఉరంహాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ట్రక్‌లో ఇంటికి వెళ్తున్నాడు. అయితే, అది ఆర్మీ వాహనాన్ని పోలి ఉండటంతో భ్రమపడ్డ కొందరు నిరసనకారులు దానిపై రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా పెద్దఎత్తున రాళ్లదాడి జరగడంతో అతని తలకు బలమైన గాయం అయింది. దాంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ ఖలీల్‌దార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఇక ఇదే నెలలో నిరసనకారుల రాళ్ల దాడిలో ఓ 11 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. విచక్షణ మరిచిన నిరసనకారులు ఉన్మాదులుగా మారుతున్నారని విమర్శలొస్తున్నాయి. -
‘నీ త్యాగం ఎందరినో కాపాడింది’
శ్రీనగర్ : కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా తొలిసారి జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పోలీసు అధికారి అర్షద్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. అనంతనాగ్‌లో ఈ నెల 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్ కుటుంబం నగరంలోని బాల్‌గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అమిత్ షా అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ కోసం అర్షద్ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడింది. అర్షద్ ఖాన్ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోంది’ అన్నారు. అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. అర్షద్ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా చిన్నవారు. వీరిలో ఒకరికి నాలుగేళ్లు కాగా మరొకరు ఏడాది నిండిన చిన్నారి. Visited the home of inspector Arshad Khan, SHO Anantnag in Srinagar, who was martyred in a terror attack & offered my condolences to the bereaved family. His sacrifice for the security of our nation has saved many lives. Entire nation is proud of Arshad Khan‘s valour & courage. pic.twitter.com/eByqlVubo6 — Amit Shah (@AmitShah) June 27, 2019 జమ్ముకశ్మీర్‌లో జూన్ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అర్షద్ కుడా ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
ఇదే నా చివరి ఫోటో కావొచ్చు..
లక్నో : చనిపోవడానికి కొన్ని గంటల ముందు కేతన్ శర్మ(29) తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అన్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. కేతన్ శర్మ పంపిన చివరి మెసేజ్‌ను తల్చుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం గురించి కేతన్ శర్మ బావమరిది మాట్లాడుతూ.. ‘కేతన్ నుంచి మాకు మెసేజ్ రాగానే.. చాలా కంగారు పడ్డాం. తనకు కాల్ చేశాం. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆర్మీ అధికారులను కలవగా.. వారు సోమవారం అనంత్‌నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ శర్మ తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలిపారు’ అన్నారు. అంత్యక్రియల నిమిత్తం కేతన్ మృతదేహాన్ని మీరట్‌కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ అంకుల్ ఆర్మీలో పని చేస్తుండేవాడు. దాంతో అతను చిన్ననాటి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోనే పెరిగాడు. ఆర్మీలో చేరాలని చిన్న వయసు నుంచే కలలు కన్నాడు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆర్మీలో చేరాడు. అతనికి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగి ఉండగా ఇవేం తెలియని అతని చిన్నారి కుమార్తె తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. #WATCH Army personnel console family members of Army Major Ketan Sharma who lost his life in Anantnag encounter yesterday. His mother says, "Mujhe batado mera sher beta kahan gaya? " #Meerut pic.twitter.com/Rl3wnpQ5gd — ANI UP (@ANINewsUP) June 18, 2019 -
కశ్మీర్లో హిజ్బుల్ ఉగ్రవాది ఎన్కౌంటర్
శ్రీనగర్ : పుల్వామా, అనంతనాగ్‌లో సంభవించిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొర ప్రాంతంలోని పంజ్‌గామ్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. 130 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది, 55 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సాయంతో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు చోసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ షౌకత్ అహ్మద్ దార్గా భావిస్తున్నారు. గతంలో ఔరంగజేబులో జరిగిన కాల్పుల్లో.. అహ్మద్ ఓ జవాన్‌ను హత్య చేశాడు. మరొక ఉగ్రవాది గురించి వివరాలు తెలియరాలేదు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు సంఘటన స్థలం నుంచి ఒక ఏకే - 56 రైఫిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని కూడా పేల్చేశారు. -
ఆ ఉగ్రవాద సంస్థలో ఎక్కువగా చేరుతున్నారు!
శ్రీనగర్: ఉగ్రవాదం వైపు అడుగులేస్తున్న కశ్మీర్ యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది 126 మంది వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. ఈ ఏడాది జూలై నాటికే 131 మంది అటు వైపు ఆకర్షితులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై 31 వరకు సేకరించిన సమాచారం ప్రకారం 131 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. వీరిలో సోఫియా జిల్లా నుంచే 35 మంది చేరినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. సోఫియా, పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్, అవంతిపురా జిల్లాల యువత ఎక్కువగా ఉగ్ర భూతం వైపు మళ్లుతున్నారని.. ఇప్పటివరకు చేరిన 131 మందిలో ఈ 5 జిల్లాల నుంచే 100 మంది ఉన్నారని తెలిపారు. అల్ కాయిదాకు మద్దతు సంస్థగా చెబుతున్న అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ వైపు యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. దీనికి పుల్వామా జిల్లాకు చెందిన రషీద్ భట్ అలియాస్ జకీర్ ముసా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలను పక్కనబెడుతూ ముసా ఇచ్చిన సరికొత్త ‘షరియత్ యా షహదత్ (ఇస్లాం చట్టాలను అమలు చేద్దాం లేదా మరణిద్దాం)’ నినాదం వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నాని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిన ముసా.. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన బుర్హన్ వనీ 2016లో హతమైన తర్వాత అక్కడి యువతను ఆకర్షించడంలో సఫలీకృతుడవుతున్నాడని అంటున్నారు. ముసా చదువులో, ఆటల్లో ముందుండేవాడని.. అంతరాష్ట్ర క్యారమ్ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడాడని చెప్పారు. అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ సంస్థ ఇంకా మొదలవలేదని పోలీసులు చెబుతున్నా.. ఆ సంస్థకు అక్కడి యువతలో ఆదరణ మాత్రం పెరుగుతున్నట్లు అనుమానం. -
మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలో మంత్రి ఫరూక్ అంద్రాబి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయి. అనంతనాగ్‌లోని డూరులో పీడీపీ మంత్రి ఫరూక్ అంద్రాబి నివాసంపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు దాడి చేశారు. సెక్యురిటీ సిబ్బంది ఉగ్రవాదులను నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో.. వారి వద్ద నుంచి ఆయుధాలు తీసుకొని ఉగ్రవాదులు పరారయ్యారు. దాడి జరిగిన సమయంలో ఫరూక్ ఆ ఇంట్లో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. శనివారం జమ్మూలో ముగ్గురు వ్యక్తులు ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏకే 47 తుపాకీని దొంగిలించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.