ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్న భద్రతా దళాలు

Encounter Breaks Out Between Security Forces Terrorists in Anantnag - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా పహల్గామ్‌లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో అనంత్‌నాగ్‌ పోలీసులు, మూడు ఆర్‌ ఆర్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ని ప్రారంభించాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలోకి రాగానే ముష్కరులు భద్రతాదళాలపై కాల్పులు జరిపాయి. దాంతో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నట్లు సమాచారం.  

ఆదివారం (జూలై 12), జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు  హతమారర్చాయి. మరణించిన ఉగ్రవాదులలో ఒకరిని లష్కర్-ఈ-తోయిబాతో సంబంధం ఉన్న ఉస్మాన్‌గా అధికారులు గుర్తించారు. ఇటీవల సోపోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్, ఒక పౌరుడు చనిపోయిన సంగతి తెలిసిందే. సోపూర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం పోలీసులకు, భద్రతా దళాలకు పెద్ద విజయమని కశ్మీర్‌ ఐజీపీ అన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, 2 ఆర్‌ఆర్, సీఆర్‌పీఎఫ్ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు సోపోర్‌లోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న తరువాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో శ్రీగుఫ్‌వారా అనంత నాగ్‌లో మరో ఇద్దరు టెరరిస్టులు మరణించారు. దీంతో 24 గంటల్లో 5గురు ఉగ్రవాదులు మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top