ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Massive fire broke out in Behrampada | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Oct 26 2017 5:44 PM | Updated on Sep 5 2018 9:47 PM

Massive fire broke out in Behrampada - Sakshi

ముంబై: నగరంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలోని బెహ్రంపాడ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 16 ఫైర్‌ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని అంధకారం ఆవహించింది. అయితే ఈ ప్రమాదంలో రైల్వే లైన్లకు, రైలు సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు.

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement
 
Advertisement
Advertisement