పంజాబ్‌లో భారీ అగ్నిప్రమాదం | Massive fire accident in Jalandhar Ludhiana | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 20 2017 4:05 PM | Updated on Sep 5 2018 9:47 PM

పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

చంఢీగఢ్‌: పంజాబ్‌లోని జలంధర్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 25 దుస్తుల దుకాణాలు అగ్నిఆహుతికావటంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. జలంధర్‌లోని జ్యోతిచౌక్‌లో ఉన్న సుదామ క్లాత్‌ మార్కెట్‌లో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, శకటాలు అక్కడికి చేరుకున్నా మంటలను అదుపులోకి చేయలేకపోయారు.

ఈ ఘటనలో మొత్తం 25 దుకాణాలు బుగ్గి అయ్యాయి. భారీగా నష్టం సంభవించిందని దుకాణాలు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే, కావాలనే ఎవరో నిప్పుపెట్టి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గంటల తర్వాత ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement