గ్రామస్తుడి కిడ్నాప్‌..హత్య | maoists murders villagers | Sakshi
Sakshi News home page

గ్రామస్తుడి కిడ్నాప్‌..హత్య

Feb 10 2017 5:41 PM | Updated on Oct 9 2018 2:53 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం చింతల్‌నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కొనన్‌గూడకు చెందిన బర్సే దేవను ఈనెల 8వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. లఖన్‌పాల్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బర్సే దేవా(32) మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు.

మావోయిస్టులుగా ఉన్న దేవ కుటుంబసభ్యులు కొందరు ఇటీవల జనజీవన స్రవంతిలో కలిశారు. దీనిని జీర్ణించుకోలేకనే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేవా హత్య నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement