కబ్జాకు పాల్పడిన బొంబారుు హైకోర్టు | Manohar Parrikar trains guns on Bombay High Court for land grabbing | Sakshi
Sakshi News home page

కబ్జాకు పాల్పడిన బొంబారుు హైకోర్టు

Oct 21 2014 3:07 AM | Updated on Sep 2 2017 3:10 PM

బొంబాయి హైకోర్టు భూకబ్జాకు పాల్పడిందంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ సోమవారం న్యాయవ్యవస్థపైనే తీవ్ర ఆరోపణలు చేశారు.

గోవా సీఎం పారీకర్ ఆరోపణ
 పణ జి: బొంబాయి హైకోర్టు భూకబ్జాకు పాల్పడిందంటూ గోవా ముఖ్యవుంత్రి మనోహర్ పారీకర్ సోమవారం న్యాయవ్యవస్థపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూమినే హైకోర్టు కబ్జాచేసిందంటూ బొంబారుు హైకోర్టు గోవా ధర్మాసనంపై ఆరోపణలు చేశారు. జ్యుడిషియల్ జవాబుదారీ బిల్లుపై గోవా శాసన సభలో చర్చ సందర్భంగా పారీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 బెంచ్ ఏర్పాటుపై పణజికి వస్తున్న హైకోర్టు తన సొంత ఉత్తర్వుతోనే భూమిని తీసేసుకుందని, దీన్ని అనుమతించబోవుని, హైకోర్టు తనంతటతాను నిర్ణయం తీసుకోజాలదని పారీకర్ అన్నారు. పణజిలో జిల్లా కోర్టు భవన సముదాయుం నిర్మాణంకోసం ఏకంగా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించిన భూమిని కూడా న్యాయవ్యవస్థ కబ్జాచేసిందని పారీకర్ అన్నారు. గోవా లో పలు బంగళాలను న్యాయవ్యవస్థ దాదాపుగా కబ్జా చేసిన సందర్భాలున్నాయుని, ఆ బంగళాలను తాను చూపెడతానని అన్నారు. కానీ, ఆయన ఆ వివరాలు వెల్లడించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement