పార్టీ జెండాతో షూ తుడుచుకున్నాడు..

Man Wipes Shoes With BJP Flag - Sakshi

లక్నో : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ జెండాతో ఓ వ్యక్తి తన షూస్‌ తుడుచుకోవడం ఘర్షణకు దారితీసింది. యూపీలోని షాగంజ్‌లో బూత్‌ నెంబర్‌ 369 వద్ద ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

పోలింగ్‌ కేంద్రం సమీపంలోని ఓ చెట్టుకింద కాషాయ పార్టీ జెండా పడి ఉండగా, ఓ వ్యక్తి తన షూస్‌ను దాంతో శుభ్రం చేసుకున్నాడు. ఇది ఓ బీజేపీ కార్యకర్త కంటపడటంతో ఆ వ్యక్తిపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మూకను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top