కాపురానికి పంపించాలని టవరెక్కిన భర్త | man suicide attempt in tamilnadu | Sakshi
Sakshi News home page

కాపురానికి పంపించాలని టవరెక్కిన భర్త

Feb 12 2015 8:30 AM | Updated on Sep 2 2017 9:12 PM

భార్య అలిగి పుట్టింటికి వెళ్ళి కాపురానికి రమ్మంటే రాలేదని భర్త సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన తమిళనాడులోని రాయకోట ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగింది.

తమిళనాడు (కెలమంగలం): భార్య అలిగి పుట్టింటికి వెళ్ళి కాపురానికి రమ్మంటే రాలేదని భర్త సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన తమిళనాడులోని రాయకోట ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగింది. రాయకోట సమీపంలోని నెల్లూరు కరుకు చెందిన సాకప్పకు శానమావుకు చెందిన చంద్రకళతో పెళ్లి జరిగింది.

ఈనెల 6న భార్య భర్తలు కీచులాడుకున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చంద్రకళను కాపురానికి రమ్మంటే రాలేదని సాకప్ప బుధవారం సాయంత్రం రాయకోట వద్ద సెల్ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు ఎంత బుజ్జగించినా కిందికి దిగి రాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement