చెన్నై: కేంద్ర సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యత్వానికి ఎల్.మురుగన్ రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడానికి తన సమయాన్ని కేటాయించాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, తన బాధ్యతల నుండి విముక్తి కల్పించాలని కోరుతూ మురుగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"ఇప్పుడు నేను క్షేత్రస్థాయికి తిరిగి వెళ్లి, మా కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ, 2029 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడానికి పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. దేశం మొదట, పార్టీ తర్వాత, స్వప్రయోజనం చివర," అని ఆయన 'X'వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
It has been the greatest honour of my life to serve Bharat Mata and Tamil Nadu under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji. From the son of daily wage labourers to serving in the Union Council of Ministers under the leadership of Hon’ble PM Shri @narendramodi Ji has been the greatest privilege of my life. Now, I wish to return to the grassroots, stand with our karyakartas and dedicate myself full-time to strengthening the BJP in Tamil Nadu ahead of the 2029 Lok Sabha elections. Nation First. Party Next. Self Last. 🙏🇮🇳 @NitinNabin @blsanthosh
— Dr.L.Murugan (@DrLMurugan) October 13, 2026
ఈ పరిణామం కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేర్పులు జరగవచ్చన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. మురుగన్‌కు ముందు, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా వరుసగా జూన్, జూలై నెలల్లో మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
ఎవరీ ఎల్.మురుగన్
మురుగన్ బీజేపీ తమిళనాడు విభాగం మాజీ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే ఆయన మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభలో తన పదవీకాలం 2030 వరకు ఉన్నప్పటికీ, ఆ పదవి నుండి తనను విముక్తి చేయాలని మంగళవారం నాడు ప్రధాని మోదీని కోరారు. ఆయన 2020లో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 జూలైలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ మంత్రివర్గంలో చేరారు.
ఇదీ చదవండి: లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్


