ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. ఐసీయూలో పెళ్లి | Man Marries Girlfriend In ICU In Pune | Sakshi
Sakshi News home page

ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. ఐసీయూలో పెళ్లి

Dec 6 2019 12:17 PM | Updated on Dec 6 2019 12:19 PM

Man Marries Girlfriend In ICU In Pune - Sakshi

పూణే: ప్రేమ వివాహాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో అసలు ఊహించలేం. కొన్ని వివాహాలు గుడిలో జరిగితే.. మరికొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతుంటాయి. కానీ పూణేలో ఓ పెళ్లి ఆస్పత్రి ఐసీయూలో జరిగింది. వివరాలు.. పూణేకు చెందిన ఓ యువతి, యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. అనంతరం యువతి మొహం చాటేసిన చాటేసిన ప్రియుడు సూరజ్‌.. పెళ్లికి నిరాకరించాడు.

దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అక్కడ కూడా న్యాయం దక్కకపోవడంతో.. తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించారు. సూరజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.. ఆమె కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ధి చేసి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం ఐసీయూలో చికిత్స పొందుతున్న తమ కుమార్తెతో వివాహం జరిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement