కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌ | Man ends life over domestic trouble | Sakshi
Sakshi News home page

కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌

Aug 4 2017 3:43 PM | Updated on Sep 17 2017 5:10 PM

కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌

కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌

కోడలు కాపురానికి రావడం లేదని పరువుతో మామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ముజఫర్‌నగర్‌: కోడలు కాపురానికి రావడం లేదని పరువుతో మామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముజఫర్‌ నగర్‌లోని నివాసముంటున్న రాజేందర్‌ కుమార్‌(50) అనే వ్యక్తి ఈ మధ్యనే తన కుమారుడికి పెళ్లి చేశాడు. అయితే, కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆమెను తిరిగి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన మామ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement