‘ప్రాణాలైనా అర్పిస్తా..రాజీ పడను’

Mamata Banerjee Says Ready To Give Her Life - Sakshi

సాక్షి, కోల్‌కతా : సీబీఐ వివాదంతో పశ్చిమ బెంగాల్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న కోల్డ్‌ వార్‌ తీవ్రస్ధాయికి చేరింది. తాను ప్రాణాలైనా అర్పిస్తాను కానీ పరిస్థితులతో రాజీపడబోనని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ పరాఈ‍్ట నేతలను కేంద్రం ఇబ్బందిపెట్టినా తాను వీధుల్లోకి రాలేదని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ పదవినీ అగౌరవపరిచేందుకు కేంద్రం ప్రయత్నించడంతో తాను ఆగ్రహానికి లోనయ్యానన్నారు. శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌ కేసుల్లో కోల్‌కతా పోలీస్‌ చీఫ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రయత్నించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాను ఆందోళనబాట పట్టానన్నారు. శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌, రోజ్‌వ్యాలీ స్కామ్‌ కేసులకు సంబంధించి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను ప్రశ్నించేందుకు ఆయన నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారుల బృందాన్ని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top