విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన కోర్టు

Mallya A Fugitive Economic Offender Says Mumbai Court - Sakshi

ముంబై: తొమ్మిది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి.. లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయ్‌ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటింటిస్తూ.. ముంబై కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు.. పరారైన ఆర్థిక నేరస్థుల చట్టం-2018లోని సెక్షన్‌ 2ఎఫ్‌ ప్రకారం అతడిని ఆర్థిక నేరస్థుడిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కేంద్ర ‍ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద.. గుర్తించబడిన మొదటి నిందితుడిగా మల్యా నిలిచారు. మాల్యా ఆస్తుల జప్తుపై ఫిబ్రవరి 5న కోర్టు వాదనలు విననుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టు ఆ​ర్థిక నేరస్తులుగా గుర్తిస్తుంది. భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా 9వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. కాగా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత రుణాల ఎగవేతదారుగా ప్రకటించబడిన మొదటి వ్యక్తి మాల్యానే కావడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top