మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి | Malegaon Blast: after 5 years in jail, charges dropped against 8 muslim men | Sakshi
Sakshi News home page

మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి

Apr 25 2016 4:10 PM | Updated on Sep 3 2017 10:43 PM

మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి

మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి

మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

న్యూఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడులో 37 మంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు.  వీరిలో ఒకరు మృతి చెందారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్లంతా గత అయిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement