
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూకుడు పెంచింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ స్ధానం నుంచి ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ కూటమి 120 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా యూపీఏ 42 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్‌లో ప్రత్యర్ధిపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ బొకార్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.