విహారయాత్రలో విషాదం.. విద్యార్థుల మృతి | Maharashtra: boat capsizes near Dahanu beach, students died | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం.. విద్యార్థుల మృతి

Jan 13 2018 2:12 PM | Updated on Nov 9 2018 4:12 PM

Maharashtra: boat capsizes near Dahanu beach, students died - Sakshi

స్నేహితుల రాక కోసం ఎదురుచూస్తోన్న స్కూల్‌ విద్యార్థులు(దహను బీచ్‌లో తాజా దృశ్యాలు)

దహను : వీకెండ్‌లో సరదాగా చేసిన విహారయాత్ర.. చివరికి విషాదంగా ముగిసింది. అరేబియా సముద్రంలో బోటు తలకిందులైన ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో తీరపట్ణమైన దహనులో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

విహారయాత్రలో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్‌ నుంచి సముద్రంలోనికి వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 36 మంది విద్యార్థులను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలు పంచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement