ఒక వరుడు.. ఇద్దరు వధువులు

Madhya Pradesh Man Marries Two Women at Same Time - Sakshi

భోపాల్‌:  ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి ఇద్దరితో కలిపి యువకుడికి పెళ్లి జరిగిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ పెళ్లి ఈ నెల 8న బేతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంలో అన్ని హంగులతో, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగడం గమనార్హం. గ్రామానికి చెందిన సందీప్‌ ఉకే తాను చదువుతుండగా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ నడుస్తుండగానే, అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు.

ఈ వ్యవహారం రచ్చబండ వద్దకు చేరింది. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అతడితో కలిసి ఉంటామని ఇద్దరు అమ్మాయిలు తేల్చి చెప్పారు. సందీప్‌ కూడా దీనికి తలూపడంతో పెళ్లి జరిగిపోయింది. మూడు కుటుంబాల వారు వారి కుటుంబసభ్యులతో హాజరై వరుడిని, వధువులను దీవించారు. గ్రామ పెద్ద మిశ్రాలాల్‌ ఈ పెళ్లికి ప్రధాన సాక్షిగా వ్యవహరించారు. అమ్మాయిలకు, వారి కుటుంబాలకు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతోనే పెళ్లికి ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top