పాపులారిటీలో ఎల్‌పీయూకు 5వ ర్యాంకు | LPU Ranked Among Top 5 Most Popular Universities in India | Sakshi
Sakshi News home page

పాపులారిటీలో ఎల్‌పీయూకు 5వ ర్యాంకు

Aug 3 2018 4:29 AM | Updated on Aug 3 2018 4:29 AM

LPU Ranked Among Top 5 Most Popular Universities in India - Sakshi

జలంధర్‌: పాపులారిటీ పరంగా దేశంలో ఢిల్లీ యూనివర్సిటీ అన్ని విద్యా సంస్థల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. జలంధర్‌ కేంద్రంగా పనిచేస్తున్న లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ)కి ఐదో స్థానం దక్కింది. ప్రముఖ విద్యా సంస్థలు, వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ‘యూనిర్యాంక్‌’ 2018 ఏడాదికి తాజాగా జాబితాను విడుదల చేసింది. 878 ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చింది. కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు వరుసగా 2, 3, 4 స్థానాలు పొందాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఆరు, ఐఐటీ ఢిల్లీకి 8వ ర్యాంకులు దక్కాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement