ప్రియురాలి గొంతుకోసి.. ఆస్పత్రి పైనుంచి దూకి.. | Lover commits suicide after slitting throat of girl | Sakshi
Sakshi News home page

ప్రియురాలి గొంతుకోసి.. ఆస్పత్రి పైనుంచి దూకి..

Dec 29 2015 10:33 AM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు.. ఆమెను ఆస్పత్రిలో చేర్చి, అదే భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాంచి: పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ప్రియురాలి గొంతుకోసి, ఆత్మహత్య చేసుకున్నాడో ప్రియుడు. రాంచిలోని పుందాంగ్ ప్రాంతంలో ఆ ఘటన చోటుచేసుకుంది. మాట్లాడదామని రమ్మని ప్రియురాలిని పిలిచి అఘాయిత్యానికి తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్మ  చేసుకోగా..  ప్రియుడి  దాడిలో తీవ్రంగా గాయపడిన  యువతి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
 
అమిత్ శ్రీవాస్తవ్ (29) స్థానిక యువతి, తన స్నేహితురాలిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె దగ్గర చాలాసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ, పెళ్లికి ఆ యువతి నిరాకరించింది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. మళ్లీ ఇద్దరి మధ్యా ఇదే విషయంలో వాగ్వాదం జరిగింది. ఆమె పెళ్లికి ససేమిరా అంది. దీంతో ఆగ్రహానికి గురైన అమిత్.. వెంటతెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. రక్త స్రావమవుతుండడంతో భయపడిన అమిత్ ప్రియురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అదే ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement