తెలుగు తేజాలకు లోక్సభ అభినందనలు | Loksabha greets Poorna, Anand kumar | Sakshi
Sakshi News home page

తెలుగు తేజాలకు లోక్సభ అభినందనలు

Jun 11 2014 12:07 PM | Updated on Mar 9 2019 3:59 PM

తెలుగు తేజాలకు లోక్సభ అభినందనలు - Sakshi

తెలుగు తేజాలకు లోక్సభ అభినందనలు

పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను లోక్సభ అభినందించింది.

న్యూఢిల్లీ: అతి పిన్నవయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజాలు మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను లోక్సభ అభినందించింది. బుధవారం లోక్సభ సమావేశాలు మొదలైన తర్వాత పూర్ణ, ఆనంద్లకు శుభాకాంక్షలు తెలిపారు.

 ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో ఇటీవల పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు. తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్‌ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి..  17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement