కన్నీటి పర్యంతమైన ఎల్‌కే అద్వాణీ

LK Advani Said Sushma Swaraj Bring Chocolate Cake Every Birthday - Sakshi

న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్‌ మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వాణీ. బుధవారం ఉదయం ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తూ.. అద్వాణీ కన్నీరు పెట్టుకున్నారు. ‘సుష్మ చాలా చిన్న వయసులోనే పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ... శక్తివంతమైన రాజకీయ వేత్తగా ఎదిగారు. నేటి తరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలిచారు. సుష్మ గొప్ప వక్త. ఆమె జ్ఞాపకశక్తిని చూసి చాలాసార్లు నేను ఆశ్చర్యపోయేవాడిని. సుష్మ ప్రతిసంవత్సరం నా పుట్టిన రోజు నాడు నాకిష్టమైన చాకొలెట్‌ కేక్‌ తీసుకొచ్చేవారు. ఒక్క సారి కూడా కేక్‌ తేవడం మర్చిపోలేదు’ అంటూ సుష్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అద్వాణీ. అంతేకాక సుష్మ చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆమె తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె మరణం బీజేపీకి తీరని లోటు అంటూ అద్వాణీ కన్నీటి పర్యంతమయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top