సింహం ఇలా దొరికిపోయింది...
అది గుజరాత్లోని అమ్రేలి జిల్లా జఫ్రాబాద్ పట్టణ తీరప్రాంతం.
గాంధీనగర్: అది గుజరాత్లోని అమ్రేలి జిల్లా జఫ్రాబాద్ పట్టణ తీరప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అరేబియా సముద్రతీరంలో స్థానికులకు కనిపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సింహం సముద్రంలోకి దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది.
స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని జాలర్ల సాయంతో సింహాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. జాలర్లు, అధికారులు పడవలపై వెళ్లి అతికష్టమ్మీద సింహాన్ని పట్టుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అధికారులు దాన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.


