కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం | Kerala Government Important decision | Sakshi
Sakshi News home page

కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం

Sep 4 2014 3:23 PM | Updated on Aug 28 2018 5:25 PM

కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం - Sakshi

కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం

కేరళ ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి ఓ కీలకమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది.

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి ఓ కీలకమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. మరుగుదొడ్లులేని ప్రైవేట్ స్కూళ్లకు ఇకపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మరుగుదొడ్లులేని ప్రభుత్వ పాఠశాలల్లో వందరోజుల్లోగా వాటిని నిర్మించాలని ముఖ్యమంత్రి  ఊమెన్ చాందీ అధికారులను ఆదేశించారు.

ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సదుపాయం ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. చాందీ అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా వుండాలని కేబినెట్‌ నిర్ణయించింది. 196 ప్రభుత్వ పాఠశాలలలో,  1011 ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలలో టాయిలెట్ల సదుపాయం లేనట్లు గుర్తించారు.
**

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement