కేరళ బడ్జెట్‌ కవర్‌ పేజ్‌పై..

Kerala Budget Depicts Mahatma Gandhis Assassination To Protest Against NRC - Sakshi

తిరువనంతపురం : జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ)కి నిరసనగా కేరళ ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాల కవర్‌ పేజీగా మళయాళ ఆర్టిస్ట్‌ గీసిన మహాత్మగాంధీ హత్య దృశ్యాన్ని ప్రచురించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కచ్చితంగా రాజకీయ స్టేట్‌మెంట్‌గానే చూడాలని, తన బడ్జెట్‌ ప్రసంగ పుస్తకానికి కవర్‌ పేజీగా మళయాళ చిత్రకారుడు మహాత్మా గాంధీ హత్యపై గీసిన పెయింటింగ్‌ను ముద్రించామని కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ చెప్పుకొచ్చారు.

మహాత్మ గాంధీని ఎవరు బలితీసుకున్నారనేది తాము మరిచిపోలేదని చాటేందుకు ఇది తాము పంపిన సంకేతమని స్పష్టం చేశారు. జనాభాను మతప్రాతిపదికన విభజించేలా ఎన్‌ఆర్‌సీని ముందుకు తెచ్చి చరిత్రలో ప్రముఖ జ్ఞాపకాలను చెరిపే సందర్భంలో తాము బడ్జెట్‌ పుస్తకానికి కవర్‌ పేజ్‌గా ఈ అంశాన్ని ఎంచుకున్నామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళకు నిధులను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిని విస్మరించి సంపన్న కార్పొరేట్లకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు.

చదవం‍డి : 105 ఏళ్ల వయసులో బామ్మ ఫీట్‌కు ఫిదా..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top