కేజ్రీవాల్ తన నిర్ణయమే చెల్లాలనుకుంటారు: ప్రశాంత్ | kejriwal behaves like a monarch, criticizes prashant bhushan | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ తన నిర్ణయమే చెల్లాలనుకుంటారు: ప్రశాంత్

Mar 4 2015 1:11 AM | Updated on Sep 2 2017 10:14 PM

కేజ్రీవాల్ ఎల్లప్పుడూ తన నిర్ణయమే చెల్లుబాటు కావాలని చూస్తారని పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ అన్నారు.


 కేజ్రీవాల్ ఎల్లప్పుడూ తన నిర్ణయమే చెల్లుబాటు కావాలని చూస్తారని పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ అన్నారు. కేజ్రీవాల్ రాజకీయ నిర్ణయాలను గౌరవిస్తానని, అయితే ఆయనా అప్పుడప్పుడు తప్పు చేయవచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పార్టీ సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్తున్నట్టు తెలిసింది. పార్టీ ఒకేవ్యక్తి చుట్టూ తిరగడం, హైకమాండ్ సంస్కృతి పెరగడం ఆందోళనకరం. ఆప్ ఖర్చులను చెప్పడం లేదు. పారదర్శకత లోపిస్తోంది. నైతిక విలువలకు కట్టుబడాలన్నది మా అభిప్రాయం. అయితేకొన్ని విషయాల్లో రాజీపడక తప్పదని కేజ్రీవాల్ భావిస్తుంటారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని నేను, యోగేంద్ర కుట్ర చేశామని వచ్చిన వార్తలన్నీ నిరాధారం’ అని అన్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా.. కే కేజ్రీవాల్ తనతో మాట్లాడలేదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement