నీరో చక్రవర్తిలా కేసీఆర్ సంబరాలు చేస్తారా? | kcr, another nero in the celebration mode, tweets digvijaya singh | Sakshi
Sakshi News home page

నీరో చక్రవర్తిలా కేసీఆర్ సంబరాలు చేస్తారా?

Jun 2 2016 8:50 AM | Updated on Aug 15 2018 9:30 PM

నీరో చక్రవర్తిలా కేసీఆర్ సంబరాలు చేస్తారా? - Sakshi

నీరో చక్రవర్తిలా కేసీఆర్ సంబరాలు చేస్తారా?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపాటు
తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

 

న్యూఢిల్లీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ పత్రికలలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని ఆయన అన్నారు. ఒకవైపు పేద ప్రజలు చనిపోతుంటే.. నీరో చక్రవర్తిలా సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తీరు సిగ్గుచేటని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు.  

గడిచిన రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందడం మనమంతా చూశామని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వడదెబ్బకు ప్రజలు చనిపోతున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని డిగ్గీ రాజా చెప్పారు. అంతకుముందు ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదించినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement