పద్మనాభుడిని దర్శించుకున్న ఎంపీ కవిత | Kavitha At Anantha Padmanabha SWamy Temple | Sakshi
Sakshi News home page

పద్మనాభుడిని దర్శించుకున్న ఎంపీ కవిత

Feb 23 2019 2:19 PM | Updated on Feb 23 2019 2:19 PM

Kavitha At Anantha Padmanabha SWamy Temple - Sakshi

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ట్రావెన్‌కోర్ మహారాణి గౌరి లక్ష్మీభాయి, ప్రిన్స్ ఆదిత్యవర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. కౌడియర్ ప్యాలెస్‌కు వెళ్లిన ఎంపీ కవితను మహారాణి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మనాభస్వామి ప్రతిమతో పాటు మహారాణి రాసిన అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర పుస్తకాన్ని కవితకు బహూకరించారు. అదేవిధంగా మహారాణికి ఎంపీ కవిత పోచంపల్లి శాలువాను   అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, ఎస్‌యూటీ మెడికల్ సైన్స్ సీఈఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీలో.. డైమండ్ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత ప్రసంగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement