
హిమాచల్ గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా గుజరాత్‌కు దేవవ్రత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్ గవర్నర్‌గా బదలాయించింది. కాగా యూపీకి చెందిన 78 సంవత్సరాల కల్‌రాజ్ మిశ్రా నరేంద్ర మోదీ కేబినెట్‌లో చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.