ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది | Jilted lover hurls acid on man in UP | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది

May 29 2015 3:58 PM | Updated on Oct 9 2018 5:39 PM

ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది - Sakshi

ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది

మహిళలపై అత్యాచారాలకు, హింసకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడిపై యాసిడ్ దాడి ఘటన సంచలనం సృష్టించింది

బాలియా: మహిళలపై అత్యాచారాలకు, హింసకు  పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లో  ఓ యువకుడిపై జరిగిన యాసిడ్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. తనతో సంబంధాన్ని ఏర్పచుకున్న 20ఏళ్ల రాజ్కుమార్ పాల్ .. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఈ దారుణానికి   ఒడిగట్టింది.  గురువారం రాత్రి యూపీలోని జామ్ గ్రామంలో  ఆ ఘటన చోటు చేసుకుందని సీనియర్ పోలీసు అధికారి సందీప్ సింగ్  వెల్లడించారు.


యాసిడ్ దాడితో  తీవ్ర గాయాల పాలైన రాజ్ కుమార్ పాల్ ను స్థానిక  ఆరోగ్య కేంద్రంలో  చికిత్స కోసం తరలించారు. బాధితుని  పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వారణాసిలోని  మరో ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుని తల్లి సదరు యువతిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం  ఆ యువతి పరారీలో ఉందని,  దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement