
ఆమిర్ ఖాన్ భార్యకు అభినందనలు
వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమిర్ ఖాన్కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి బాసటగా నిలిచారు.
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమిర్ ఖాన్కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి బాసటగా నిలిచారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ ఖాన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాలలో నటించిన ఆమిర్.. సముచిత స్థానంలో ఉన్నాడని ఆయన తెలిపారు.
గత కొన్ని మాసాలుగా తానూ అభద్రతాభావంతో ఉన్నానని జైపాల్ రెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న అసహనంపై తన అభిప్రాయాన్ని నిజాయితీగా భర్తకు తెలిపిన కిరణ్ రావును ఆయన అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అలా అభిప్రాపయడటం సహజమేనని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.