‘అగస్టా’ మధ్యవర్తి అప్పగింతకు ఇటలీ నో!

Italy refuses to extradite AgustaWestland middleman Carlo Gerosa - Sakshi

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని భారత్‌కు అప్పగించేందుకు ఇటలీ నిరాకరించింది. ఇటలీకి చెందిన కార్లో వాలెంటినో ఫెర్డినాండో గెరోసా (71) అనే వ్యక్తి భారత వైమానిక దళం మాజీ చీఫ్‌ ఎస్పీ త్యాగి బంధువులతో భేటీ అయిన తర్వాతనే హెలికాప్టర్ల ప్రమాణాల్లో మార్పులు చేసే కుంభకోణం మొదలైందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కార్లోపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయగా ఇటలీ పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. అయితే భారత్, ఇటలీల మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందమేదీ లేనందున భారత అభ్యర్థనను ఇటలీ తిరస్కరించింది. దీంతో ఒప్పందం లేకుండానే కార్లోను భారత్‌కు ఎలా రప్పించాలో వివరిస్తూ సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయం కోరింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top