ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం | Investigation intensifies on weapons ship of China | Sakshi
Sakshi News home page

ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం

Oct 13 2013 2:46 PM | Updated on Sep 1 2017 11:38 PM

ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం

ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం

అక్రమంగా భారీ ఆయుధాలతో తరలి వస్తున్న నౌకను తమిళనాడు మెరైన్ పోలీసులు పట్టుకున్నారు.

  చెన్నై: అక్రమంగా భారీ ఆయుధాలతో తరలి వస్తున్న చైనా నౌకను తమిళనాడు మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. తుత్తుకుడి పోర్టుకు 3 కిలో మీటర్ల దూరంలో అధికారులు దీనిని నిలిపివేసి తనిఖీ చేశారు. ఈ నౌకలో పది మంది సిబ్బందితోపాటు  25 మంది సాయుధులు ఉన్నారు. ఈ నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు కూడా ఉన్నాయి. ఈ నౌకను  సోమాలియా బంధిపోట్లు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు.

గతంలొ ముంబయిలో దాడులకు పాల్పడేందుకు కసబ్ తదితర ఉగ్రవాదులు  సీమెన్‌గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ  ఆదేశాలు జారీ చేసింది. సీమెన్‌గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు ఏమీ లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం మన అధికారులు తనిఖీ చేసిన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్‌ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను తూత్తుకూడి అధికారులు సముద్రంలోనే నిలిపివేశారు.

అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్‌గార్డు నౌకలో తనిఖీలు చేశారు.  నౌకలో  అనేక ఆయుధాలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్‌కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు.
 
 అమెరికా నుంచి రాక!

 చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా అనుమతి పొందామని వివరించారు. అయితే చైనా నౌక వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాలలో విధ్వంసాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్‌గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్‌గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement